ప్రభాస్ కొత్తచిత్రం 31 నుంచి
'బుజ్జిగాడు' చిత్రం తర్వాత హీరో ప్రభాస్, సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వంతో పాటు సమర్పకుడుగా కూడా వ్యవహరించనున్నారు. ఆదిత్య రామ్ మూవీస్ పతాకంపై ఆదిత్య రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూరీ-ఆదిత్య రామ్ కాంబినేషన్ లో ఇటీవల ప్రకటించిన 10 చిత్రాల్లో ఇదొకటి. ఇందులో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించనుంది. ఈ చిత్రం షూటింగ్ ఈనెల 31 నుంచి ప్రారంభమవుతుందని పూరీ జగన్నాథ్ తెలిపారు.
ప్రభాస్ తో చేస్తున్న మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది అనీ, అన్ని ఎమోషన్లతో కూడిన పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో స్టైలిష్ గా ఈ చిత్రం ఉంటుందనీ పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ఈనెల 31 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జూలై వరకూ ఏకథాటిగా జరిపే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ చెప్పారు. ఈ చిత్రానికి 'ఏక్ నిరంజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమచారం.
Be first to comment on this News / Article!
|