29న 'లైఫ్ స్టైల్' ఆడియో
'తాజ్ మహల్', ' ప్రియా ఓ ప్రియా', 'సందడే సందడి', సంక్రాంతి' వంటి హిట్ చిత్రాల దర్శకుడు ముప్పలనేని శివ తాజా చిత్రం 'లైఫ్ స్టైల్'. ఎస్.ఎం.సినీమ్యాక్స్ పతాకంపై శ్రీ మాధవ్ పట్నాయక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిశ్చల్, కార్తీక్, అభిరామ్ హీరోలుగా, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి, అనన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 21తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. 29న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల చేస్తున్నామనీ, డాక్టర్ డి.రామానాయుడు, దిల్ రాజు, సి.కల్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారనీ దర్శకనిర్మాతలు తెలిపారు.
ఈనెల 18 నుంచి 21 వరకూ సినిమాలోని ప్రధాన తారగణమంతా పాల్గొన్న చివరి పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తయిందనీ, డాన్స్ మాస్టర్ విద్య నేతృత్వంలో ఈపాట చిత్రీకరించామనీ ముప్పలనేని శివ తెలిపారు. బ్యాంకాక్, పటాయ్, వైజాగ్, బాపట్ల, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈచిత్రం షూటింగ్ జరిపినట్టు చెప్పారు. ఈ చిత్రం ద్వారా శ్రీజ ఎస్.సి. అనే మహిళను సంగీత దర్శకురాలిగా పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాత మాధవ్ పట్నాయక్ మాట్లాడుతూ, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ఈనెల 29న ఆడియో, ఏప్రిల్ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, గిరిబాబు, సన, శివపార్వతి తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|