'మిత్రుడు' పాటలు 2న
యువరత్న బాలకృష్ణ, గ్లామర్ తార ప్రియమణి జంటగా వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మిత్రుడు'. రాజమౌళి శిష్యుడు మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ 2న లహరి మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
బాలకృష్ణ, మణిశర్మల కలయికలో వచ్చిన చిత్రాలు గతంలో మ్యూజికల్ హిట్స్ అయ్యాయనీ, ఈ చిత్రానికి కూడా మణిశర్మ అందించిన సంగీతం ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తుందని ఆయన అన్నారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. కేవలం ఒక పాట షూటింగ్ మిగిలి ఉందనీ, త్వరలోనే ఆ పాటను చిత్రీకరిస్తామని చెప్పారు. మరోవైపు నిర్మాణాంతర పనుల్లో భాగంగా డబ్బింగ్ పూర్తయిందనీ, శనివారం నుంచి రీరికార్డింగ్ మొదలుపెట్టామనీ తెలిపారు. హైద్రాబాద్ తో పాటు మలేసియా కూడా ఈ చిత్రం షూటింగ్ జరిపామనీ, విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథకు ఎం.రత్నం చక్కటి సంభాషణలు సమకూర్చారని చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరుకు సినిమా విడుదల చేస్తామని తెలిపారు.
Be first to comment on this News / Article!
|