'టిక్ టిక్ టిక్'కు అనుష్క
కృష్ణ భగవాన్, వేణుమాధవ్, సైరాభాను, షరీఫ్, ప్రేమ, అమృత ప్రధాన తారాగణంలో అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న థ్రిల్లర్ 'టిక్ టిక్ టిక్'. దీనికి 'యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ' అనే ట్యాగ్ లైన్ ఉంది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అరుణకాంత్ నిర్మిస్తున్నారు. వినోదాత్మక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యమాలు జరుగుతున్నాయనీ, ఏప్రిల్ 1న ఆడియో విడుదల చేస్తున్నామనీ తెలిపారు.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా హైద్రాబాద్ లో జరిగే వేడుకలో ప్రముఖ సినీ నటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను విడుదల చేస్తారని ఆయన చెప్పారు. మణిశర్మ వద్ద సహాయకుడుగా పనిచేసిన కానూరి వీనులవిందైన సంగీతాన్ని అందించారనీ, ఇందులో అందర్నీ అలరించే ఐదు పాటలు ఉంటాయనీ చెప్పారు. ఏప్రిల్ నెలలోనే సినిమా విడుదలకు కూడా ప్లానింగ్ చేస్తున్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
|