ఇరగదీస్తున్న'బుద్ధిమంతుడు'
ఉపేంద్ర కథానాయకుడుగా శుక్రవారంనాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బుద్ధిమంతుడు' చిత్రం హిట్ టాక్ తో మంచి ఓపినింగ్స్ రాబట్టిందని చిత్ర నిర్మాతలు హెచ్.లక్ష్మీకాంతరెడ్డి, పి.హనుమంతరెడ్డి తెలిపారు. హైద్రాబాద్ లో శనివారంనాడు ఈ చిత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
ఉగాది రోజున సినిమా విడుదలైనప్పటికీ పండుగను కూడా లెక్కచేయకుండా మహేళా ప్రేక్షకులు థియేటర్లకు బాగా హాజరయ్యారనీ, ఆంధ్రదేశమంతటా హిట్ టాక్ వచ్చిందనీ నిర్మాతల్లో ఒకరైన హనుమంతరెడ్డి చెప్పారు. రోజురోజుకూ యూత్, మహిళా ప్రేక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందనే నమ్మకం తమకుందని అన్నారు. 65 ప్రింట్లతో 95 థియేటర్లలో సినిమా విడుదల చేశామనీ, కన్నడంలో కంటే తెలుగులో ఈ చిత్రానికి మరింత మంచి టాక్ వచ్చిందని చెప్పారు. పంపిణీదారుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఉపేంద్ర పోషించిన ఆరు పాత్రలకు చాలా వైవిధ్యంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాయని చెప్పారు. ఉగాది రోజున హైద్రాబాద్ లోని థియేటర్లను ఉపేంద్ర సందర్శించారనీ, ఆయనకు తెలుగు ప్రేక్షకులలో ఎంతటి ఇమేజ్ ఉందో మరోసారి రుజువు చేస్తూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారనీ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|