నమిత 'దేశద్రోహి'
బొద్దుగా ముద్దుగా కనిపించే నమిత దేశద్రోహం చేయడం ఏమిటని అనుకునేరు. అలాంటిదేమీ లేదు. 'దేశద్రోహి' అనే కొత్త చిత్రానికి నమిత కమిట్ అయింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా కలిసి రాని నమిత తమిళంలోకి వెళ్లిన తర్వాత మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో వరుస సినిమాలకు ఒప్పుకుంటూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఆసక్తికరంగా నమిత నటించిన రెండు చిత్రాలు ఇదే సమ్మర్ లో విడుదలవుతుండటం ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రభాస్ కథానాయకుడుగా ఫ్రిబ్రవరి 2న విడుదలకు సిద్ధంగా ఉన్న 'బిల్లా'లో నమిత తన గ్లామర్ కు మరింత పెట్టినట్టు సమాచారం. అనుష్క కథానాయిక అయినప్పటికీ, బికినీ ధరించిందని చెబుతున్నప్పటికీ, గ్లామర్ పరంగా ఆమెకు నమిత కూడా గట్టి పోటీనే ఇవ్వబోతోంది. ఇక
రాజా కథానాయకుడుగా రూపొందుతున్న జానపద చిత్రం 'జగన్మోహిని'లో టైటిల్ రోల్ నమిత పోషించింది. ఆ చిత్రం కూడా ఏప్రిల్ టార్గెట్ గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. జయమాలిని నటించగా అప్పట్లో విజయవంతమైన 'జగన్మోహిని' చిత్రానికి ఇది రీమేక్ అన్నమాట. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో 'దేశ ద్రోహి' చిత్రానికి నమిత కమిట్ అయింది. ఇందులో నమిత పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతోంది. ఖాకీ ధరించినంత మాత్రన సివిల్ డ్రెస్ వేసుకోదని కాదు. నమిత బ్రాండ్ ఉండనే ఉంటుంది. నమితతకు జోడిగా శరత్ చంద్ర ('త్రీ' ఫేమ్) నటించబోతున్నారు. జ్యోతి ప్రసాద్ దర్శకత్వంలో కె.ఎస్.నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
Be first to comment on this News / Article!
|