నితిన్ హ్యాపీ బర్త్ డే
యంగ్ హీరో నితిన్ సోమవారంతో 26వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. నటుడిగా 'జయం', 'దిల్' వంటి చిత్రాలు ఆయనకు మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన 'ద్రోణ' చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయి బయ్యర్లంతా హ్యాపీగా ఉన్నారనీ, సక్సెస్ తెచ్చిన ఆనందంతో ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాననీ నితిన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పెక్ట్రా మీడియా లిమిటెడ్ పతాకంపై పరుచూరి మురళి ('ఆంధ్రుడు' ఫేమ్ ) దర్శకత్వంలో జి.వెంకట రమణ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్నారు. నితిన్ సరసన ఇలాయానా నటిస్తోంది. దుబాయ్ లోని చిత్ర యూనిట్ మధ్య నితిన్ తన బర్త్ డే వేడుక జరుపుకొంటున్నారు.
తెలుగులో మూడు దశాబ్దాలుగా రాని ఓ వైవిధ్యమైన కథతో స్పెక్ట్రా మీడియా చిత్రాన్ని పరుచూరి మురళి తెరకెక్కిస్తున్నారు. 60 రోజుల పాటు దుబాయ్ లో ప్రస్తుత షెడ్యూల్ ఉంటుంది. నితిన్ ఈ ఏడాది బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతుంటడం విశేషం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న 'అగ్యాత్' చిత్రం ద్వారా నితిన్ హిందీలో పరిచయమవుతున్నారు. ఈ చిత్రం జూలైలో హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. నితిన్ తాజాగా మరో రెండు తెలుగు చిత్రాలు కూడా అంగీకరించారు. ఈశ్వర్ రెడ్డి ('సిద్ధు ఫ్రమ్ సికాకుళం' ఫేమ్) దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్ నిర్మించే చిత్రం మే లో ప్రారంభమవుతుంది. జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో జూలై లో మరో చిత్రం ప్రారంభమవుతుంది. మల్టీ స్టారర్ చిత్రాలకూ సిద్ధంగా ఉన్నాననీ, అమీర్ ఖాన్ చేసిన 'గజనీ' తరహా పాత్రను పోషించాలనే కోరిక ఉందనీ నితిన్ తన మనోగతం వెల్లడించారు.
Be first to comment on this News / Article!
|