' లైఫ్ స్టైల్ ' పాటలు
నిశ్చల్, కార్తీక్, అభిరామ్ హీరోలుగా, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి, అనన్య హీరోయిన్లుగా ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫిల్మ్ 'లైఫ్ స్టైల్'. ఎస్.ఎం. సినిమాక్స్ పతాకంపై శ్రీ మధవ్ పట్నాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్.సి.శ్రీజ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు ఆడియో సీడీని, తొలి క్యాసెట్ ను మరో అతిథి సి.కల్యాణ్ ఆవిష్కరించి రమేష్ ప్రసాద్ కు అందజేశారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది.
నిర్మాత మాధవ్ పట్నాయక్ మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వారా శ్రీజ సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారనీ, ఆమె అందించిన సంగీతం సినిమాకి ఓ ప్రధాన హైలైట్ అవుతుందనీ చెప్పారు. దర్శకుడు ముప్పలనేనికి సంగీతంపై ఉన్న అభిరుచి కూడా ఆడియో బాగా రావడానికి దోహదపడిందన్నారు. అలాగే సినిమాలో హీరో నిశ్చల్ అత్యద్భుతమైన డాన్స్ పెర్ ఫారమెన్స్ చూపించారని ప్రశంసించారు. సమ్మర్ కానుకగా సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ, మూడు యువజంటల మధ్య నడిచే చక్కటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇదని చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, శ్రీజ చాలా చక్కటి సంగీతాన్ని అందించారనీ చెప్పారు. సంగీత దర్శకురాలిగా తనకు అవకాశమిచ్చి ప్రోత్సహించిన దర్శకనిర్మాతలకు శ్రీజ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో ఏడు పాటలుంటాయనీ, అవన్నీ కూడా సిట్యుయేషనల్ పరంగానే ఉంటాయనీ ఆమె తెలిపారు. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించాలని అతిథులు అభిలషించారు. ఈ కార్యక్రమానికి సింగర్ గీతా మాధురి యాంకరింగ్ చేశారు.
Be first to comment on this News / Article!
|