నాగ్-టబూ చెట్టాపట్టాల్ !
'కింగ్' సక్సెస్ తర్వాత నాగార్జున ఏమి చేస్తున్నారు? మే నుంచి మరో కొత్త సినిమాకి రెడీ అయ్యేలోగా కొద్దిపాటి విశ్రాంతిని తీసుకుంటున్నారు. ఈ గ్యాప్ లో స్టూడియో డవలప్ మెంట్ పనులు, తన తనయుడు నాగచైతన్య 'జోష్' సినిమా ఎలా వస్తుందనే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునేందుకు తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. పనిలో పనిగా ఎలెక్షన్ల తరుణం కాబట్టి ఇటు పొలిటికల్ పార్టీల నుంచి ఏదో రకమైన ఆబ్లిగేషన్స్ రాకుండా అవుటాఫ్ స్టేషన్ లో ఉండటానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన తాజాగా ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ప్రత్యక్షమయ్యారు. ఇందులో ఆశ్చర్యపడాల్సినది ఏముందంటారా? ఆశ్చర్యం కాకపోయినా తన చిరకాల స్నేహితురాలు టబుతో కలిసి ఆయన చెట్టాపట్టాలేసుకుని కనిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
నాగార్జున, టుబూ మంచి ఫ్రెండ్స్ అనేది టాలీవుడ్ లో అందరికీ తెలిసిన విషయమే. పదేళ్లుగా ఈ ఫ్రెండ్ షిప్ కంటిన్యూ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆమె కోసం ప్రత్యేకంగా ఓ కారు ఎప్పుడూ రెడీగా ఉంటుందని కూడా చెబుతుంటారు. ఈ ఇద్దరికి సంబంధించిన రూమర్స్ ను కూడా నాగార్జున ఎప్పుడూ సీరియస్ గా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. లక్మే ఫ్యాషన్ వీక్ లో నాగార్జున, టబూ కలిసి కనిపించడమే కాకుండా నాగార్జున ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఫోటోలు కూడా దిగడం విశేషం. నాగార్జున సుమారు ఓ రెండు గంటల సేపు 'లక్మే' కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించారు. టబూ విషయంలోనూ జరిగిందదే.
Be first to comment on this News / Article!
|