గుణ్ణం సినిమాలో జెనీలియా
తొలుగులో తొలి ఇన్నింగ్స్ ఫెయిల్ అయినా మలి ఇన్సింగ్స్ తో సృష్టించిన నటి జెనీలియా డిసౌజా. 'బొమ్మరిల్లు' సినిమా తర్వాత జెనీలియా దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. ఆ చిత్రం తమిళంలో 'సంతోష్ సుబ్రమణియం'గా విడుదలై మరింత మంచి విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిందీలో రీమేక్ అవుతున్న 'ఇట్స్ మై లైఫ్'లోనూ జెనీలియా నటిస్తోంది. దీనికితోడు ఇటీవల జెనీలియా నటించిన 'జానే తు య జానే న' పెద్ద హిట్ కావడంతో జెనీలియా అక్కడ కూడా బిజీ అయిపోయింది. డేవిడ్ ధావన్ 'హుక్ య క్రూక్', తుషార్ కపూర్ సరసన నటిస్తున్న 'లైఫ్ పార్టనర్ ' కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంత బిజీలోనూ తెలుగులో ఓ కొత్త చిత్రానికి జెనీలియా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ దర్శకనిర్మాత గుణ్ణం గంగరాజు నిర్మించనున్న కొత్త చిత్రంలో జెనీలియా ప్రధాన భూమికను పోషించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది
'లిటిల్ సోల్జర్స్', 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'అమ్మ చెప్పింది' వంటి పలు చిత్రాలను రూపొందించిన గుణ్ణం గంగరాజు ఈసారి . శ్రీనివాస్ అనే యువ దర్శకుడిని కొత్త చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నారు. కథ నచ్చి ఇందులో నటించేందుకు జెనీలియా అగ్రిమెంట్ చేసిందని సమాచారం. సెలక్టివ్ గా అయినా మంచి పాత్రలు ఎంచుకుంటున్న జెనీలియాకు ఈ చిత్రం తెలుగులో మరో హిట్ ను ఖాయం చేస్తుందనుకోవచ్చు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|