బికినీ బయటకొచ్చింది!
నిన్నటి వరకూ 'అరుంధతి' చిత్రంలో డ్యూయెల్ రోల్ తో సంచలనం సృష్టించిన అనుష్క ఇప్పుడు ఇందుకు భిన్నమైన పాత్ర పోషణ, ఆహార్యంతో యూత్ ఆడియెన్స్ ను తన బికినీ అందాలతో కంటిమీద కునుకు లేకుండా చేయబోతోంది. ప్రభాస్ కథానాయకుడుగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ మూవీ 'బిల్లా' ఈ ఏడాదిలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తమిళంలో అజిత్-నయనతార జంటగా నటించిన 'బిల్లా' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందడంతో సహజంగానే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అయింది. తమిళ 'బిల్లా'లో నయనతార బికినీ ధరించి సృష్టించిన సంచలనం ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర వహించింది. నయనతారను నెంబర్ వన్ రేసులో నిలిపింది. తొలుత తెలుగు వెర్షన్ కోసం ఇదే పాత్రకు నయనతారను సంప్రదించినప్పటికీ రిపీట్ మ్యాజిక్ కు ఆమె సిద్ధపడకపోవడంతో అనుష్క ఆ ఛాన్స్ దక్కించుకుంది. దీంతో నయనతారలా అనుష్క బికినీలో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉందంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే బికినీ వ్యవహారంపై అనుష్క ఇంతవరకూ పెదవి విప్పలేదు. విడుదలకు మరికొద్దిరోజులే వ్యవధి ఉండటంతో క్రమంగా ప్రమోషన్ వర్క్ ను పెంచుతున్న నిర్మాతలు తాజాగా అనుష్క బికినీ పోస్టర్లను రిలీజ్ చేశారు.
నయనతారతో కంపేర్ చేయడం కుదరనప్పటికీ అనుష్క బికినీలో ఏమాత్రం తీసిపోలేదనీ, స్లిమ్ గా హాలీవుడ్ స్టయిల్ ఆఫ్ యాక్ట్రస్ ను తలపిస్తోందనీ ఈ పోస్టర్లు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత స్టయిలిష్ గా హాలీవుడ్ రేంజ్ కు తగ్గకుండా మెహర్ రమేష్ తెరకెక్కించినట్టు చెబుతుండటం, అనుష్కకు ధీటుగా నమిత సైతం అందాల ప్రదర్శనలో పోటీపడిందని తెలుస్తుండటం ఆడియెన్స్ లో 'బిల్లా'పై మరింత క్రేజ్ ను పెంచుతోంది. అధికారికంగా ఈ చిత్రం రిలీజ్ ను ఇంకా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 3న 'బిల్లా' రిలీజయ్యే అవకాశాలున్నాయి. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున 'జల్సా' చిత్రం విడుదలై చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. అదే సెంటిమెంట్ తో 'బిల్లా' సైతం సమ్మర్ సెన్సేషన్ సృష్టిస్తుందని ఫిల్మ్ మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
Be first to comment on this News / Article!
|