మళ్లీ నటిస్తా : ఆర్తి అగర్వాల్
15 కేజీలు తగ్గాను...
'గోరింటాకు' సినిమా సమయంలో చాలా లావుగా ఉన్నమాట నిజమేననీ, అయితే ఇప్పుడు 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రంలో మాదిరిగానే స్లిమ్ గా ఉన్నాననీ అంతా చెబుతున్నారని ఆర్తి పేర్కొన్నారు. అమెరికాలో రెగ్యులర్ జిమ్, యోగా చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించినట్టు చెప్పారు. రైస్, ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉంటూ జ్యూస్, పండ్లు తీసుకోవడంతో దాదాపు 15 కిలోల బరువు తగ్గినట్టు చెప్పారు. ఈ రెండేళ్ల వ్యవధిలో ఎందరో కొత్త హీరోయిన్లు పరిశ్రమలోకి వచ్చినందున ఆ పోటీని ఎలా తట్టుకుంటారని అడిగినప్పుడు 'ఆరోగ్యకరమైన పోటీని నేను కోరుకుంటాను. ఏ రంగంలో అయినా పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. నటన, గ్లామర్ వంటి ప్రత్యేకతలతో నెగ్గుకొస్తాననే నమ్మకం నాకుంది' అని ఆర్తి ధీమా వ్యక్తం చేశారు. నటిగా తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యమనీ, తమిళ, హిందీ, తదితర భాషల్లోనూ అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నాననీ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన చెల్లెలు అదితి అగర్వాల్ సైతం అమెరికాలోనే ఉంటోందనీ, తనకు మంచి పేరు తెచ్చిపెట్టే ఆఫర్లు వస్తే నటించేందుకు సిద్ధంగానే ఉందనీ తెలిపారు. ఆర్తితో పాటు ఆమె తండ్రి శశాంక్ అగర్వాల్, సూపర్ గుడ్ తరఫున నిర్మాత వాకాడ అప్పారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|