'మనోరమ'కు ప్రేక్షకాదరణ
ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదనే ఇతివృత్తంతో ఛార్మి కథానాయికగా జీ మోషన్ పిక్చర్స్ నిర్మించిన 'మనోరమ' చిత్రం ప్రేక్షకుల ఆదరణ చూరగొంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేష్, దర్శకుడు వి.ఈశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఫిలిం ఛాంబర్ లోని నిర్మాతల మండలి హాలులో సోమవారంనాడు ఈ చిత్రం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
'మనోరమ' చిత్ర కథను ఈశ్వర్ రెడ్డి తనకు చెప్పగానే ఎంతగానో ఇంప్రెస్ అయ్యాయనీ, ముంబై జీ ఫిలిమ్స్ వారు కూడా ఓకే చేయడంతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందనీ చెప్పారు. సహజంగా కార్పొరేట్ సంస్థలకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో అంతగా పనుండదనీ, సొంతంగానే రిలీజ్ చేస్తుంటారనీ అన్నారు. 'మనోరమ' చిత్రం డైరెక్టర్స్ మూవీ అనీ, మంచి ప్రేక్షకాదరణ లభిస్తోందనీ చెప్పారు. దర్శకుడు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మొదటి రోజు నుంచి కలెక్షన్లు బాగున్నాయనీ, పరీక్షల సీజన్ కాబట్టి అనుకున్నంత స్థాయిలో లేకపోయినా ఇప్పుడు ఆ కలెక్షన్లు 20 శాతం పెరిగాయని అన్నారు. మునుముందు మరింత మంచి కలెక్షన్లు వస్తాయనే నమ్మకం తనకుందన్నారు. మొదటిరోజు 20 ప్రింట్లతో విడుదల చేశామనీ, ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని మరో ఆరు ప్రింట్లు అదనంగా జోడించామనీ చెప్పారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు తన కృతజ్ఞతలని అన్నారు. సక్సెస్ మీట్ లో రచయిత వెనిగెళ్ల రాంబాబు, నటులు శ్రీవాత్సవ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|