ప్రభాస్ 'బిల్లా' 3న ఖరారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క హీరోహీరోయిన్లుగా గోపీ కృష్ణ మూవీస్ సమర్పణలో నరేంద్ర, ప్రబోధ్ నిర్మించిన 'బిల్లా' చిత్రాన్ని ఫ్రిబ్రవరి 3న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం సాయంత్రం చిత్రయూనిట్ మీడియాతో సమావేశమై విడుదల తేదీని ప్రకటించింది. చిత్ర సమర్పకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామలా కృష్ణంరాజు, దర్శకుడు మెహర్ రమేష్., చిత్ర నిర్మాతలు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
కృష్ణంరాజు మాట్లాడుతూ, ఓ పదిహేనేళ్ల క్రితం వరకూ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఎన్నో సకెస్స్ ఫుల్ చిత్రాలు నిర్మించామనీ, చాలా గ్యాప్ తర్వాత ఎంతో కాన్ఫిడెన్స్ గా, లావిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామనీ చెప్పారు. ప్రభాస్ ను ఎలా ప్రెజెంట్ చేయాలని అనుకున్నామో అంతకంటే ఎక్కవగా ఈ చిత్రాన్ని చెప్పినదాని కంటే బాగా తీసి దర్శకుడు మెహర్ రమేష్ తన సత్తా చాటుకున్నాడని అన్నారు. 70 రోజుల పాటు మలేషియాలోనూ, ఆ తర్వాత ఇక్కడా సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశామన్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా తన పాత్ర కూడా చాలా బాగా వచ్చిందన్నారు. ప్రభాస్ కెరీర్ లోనే ఈ చిత్రం చాలా మంచిపేరు తెస్తుందనీ, ఇప్పుడు చెప్పడం గొప్పగా చెప్పినట్టు ఉంటుందనీ, అయితే తమ అంచనాలను కూడా మించి ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ అవుతుందనీ ధీమా వ్యక్తం చేశారు. గోపీకృష్ణ బ్యానర్ కు ఇది మరో మంచి చిత్రమవుతుందని శ్రీమతి శ్యామలా కృష్ణంరాజు పేర్కొన్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ, మొదట్లో తాను రెండు కథలు చెప్పాననీ, ఒక కథ పరిమిత బడ్జెట్ లో చేయవచ్చనీ, అయితే రెండో కథ కృష్ణంరాజు కు బాగా నచ్చి ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా తీద్దామని చెప్పడంలో 'బిల్లా' చిత్రం తెరకెక్కిందన్నారు. మలేసియాలో భారీ షెడ్యూల్ తర్వాత ఇక్కడకు వచ్చి మలేసియా తరహా భారీ సెట్స్ వేసి సినిమా తీశామనీ, ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఇంత తక్కువ వ్యవధిలో తీయడం అందరికీ ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రభాస్ కెరీర్ లోనే ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందనే గట్టి నమ్మకం తనకుందన్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
Be first to comment on this News / Article!
|