రియల్ స్టోరీ 'పోలీస్ పోలీస్'
పోలీసు కథాంశంతో గతంలో పలు చిత్రాలు వచ్చినప్పటికీ వాటికి భిన్నంగా పూర్తి పోలీసు కథతో 'పోలీస్ పోలీస్' చిత్రాన్ని మలిచినట్టు ఆ చిత్ర దర్శకుడు మన్ మోహన్ తెలిపారు. శ్రీరామ్, పృధ్వీరాజ్, కమలినీ ముఖర్జీ, సంజన ప్రధాన పాత్రధారులుగా పినాకిర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చందు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కార్యక్ర్రమాలు పూర్తి చేస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో మంగళవారంనాడు ఆ వివరాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
ఒక పోలీసు అధికారి చెడ్డవాడయితే సమాజంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చర్చించామనీ, పత్రికల్లో వచ్చిన వాస్తవ సంఘటనల ప్రేరణతో ఈ కథను తానే తయారు చేసుకున్నాననీ మన్ మోహన్ తెలిపారు. స్త్రీన్ ప్లే ప్రధానంగా సాగే యాక్షన్ చిత్రమిదని అన్నారు. శ్రీరామ్ ఐపిఎస్ గానూ, పృధ్వీరాజ్ ఎసిపిగానూ నటించారనీ, ముఖ్యంగా ఈ ఇద్దరూ పోటీపడి నటించారనీ చెప్పారు. పృధ్వీరాజ్ నెగిటివ్ పాత్రను ఎంతో చక్కగా రక్తికట్టించారనీ, కమలినీ ముఖర్జీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనీ చెప్పారు. ఇందులోని నాలుగు పాటలు ప్రేక్షకులను అలరిస్తాయన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించామనీ, తమిళంలో సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఏప్రిల్ నెంలలో రెండు భాష్లలోనూ సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో దండపాణి, బ్రహ్మాజీ, విక్రమ్, సివిఎల్, అమిత్ తదితరులు నటించారు. భరణీ కె.ధరన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, విశ్వ- సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|