'ప్లస్ టు' ప్రేమకథ
ప్రేమ కథలకు భాషతో నిమిత్తం లేదు. ఏ భాషలో నుంచి ఏ భాషలోకి తర్జుమా అయినా ప్రత్యేకించి ఆ తరహా చిత్రాలను ఇష్టపడే ఆడియెన్స్ ఉండనే ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే పలు అనువాద చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. తాజాగా మలయాళంలో రూపొందిన ఓ చిత్రాన్ని 'ప్లస్ టూ' పేరుతో ఆరె.కె. సినిమా తెలుగులోకి అనువదించింది. మందపాటి అనసూయ సమర్పణలో మందపాటి వెంకట రాధాకృష్ణ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీనికి రోషన్ ఆండ్రూస్ దర్శకుడు.
తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు ఎలా ఉండాలన్న అంశాన్ని దర్శకుడు ఆండ్రూస్ ఎంతో వైవిధ్యంతో తెరకెక్కించారనీ, యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిందనీ నిర్మాతలు తెలిపారు. తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని
సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. రోమ, మరియ, పార్వతి, ఐశ్వర్య, సీత, సుకన్య, సురేష్ గోపి, స్కంధ, సుధ తదితరులు ఈ చిత్రంలో నటించారు. శశాంక్ వెన్నెలకంటి మాటలు, వెన్నెలకంటి పాటలు, దివాకర్ సినిమాటోగ్రఫీ, అబ్రహాం ఎడిటింగ్, మిజో జోసఫ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|