'అరుంధతి' చీరలు
ఈ ఏటి బ్లాక్ బస్టర్ హిట్ 'అరుంధతి' సంచలనం ఇంకా చల్లారలేదు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఈ చిత్రం అనువాద రూపంలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీనికి వ్యాపార కోణం కూడా జోడించి పలువురు వస్త్ర వ్యాపారులు మహిళలను తమ షోరూమ్ ల వైపు ఆకర్షిస్తున్నారు. 'అరుంధతి' నిర్మాణ సమయంలో అనుష్క కాస్ట్యూమ్స్, జ్యూయెలరీ విషయాల్లో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముంబైకి చెందిన కాస్ట్యూమ్స్ డిజైనర్ దీప చేత అనుష్క కాస్ట్యూమ్స్, నగలు డిజైన్ చేయించారు. జేజమ్మ పాత్ర కోసం సంప్రదాయ దుస్తులు, ఆభరణాల కోసం శ్యాంప్రసాద్ రెడ్డి అక్షరాలా 10 లక్షలు ఖర్చు చేశారు. ఇక వీటి తయారీకి అయిన లేబర్ చార్జీలు ఖర్చు లక్ష రూపాయలు. అనుష్క ధరించిన గోల్డ్ బరువు 22 కిలోల వరకూ ఉంటుంది. 'అరుంధతి' చిత్రం కోసం మహిళలు విరగడబడానికి ఇవి ప్రత్యేక కారణాలుగా చెప్పుకోవచ్చు. అనుష్క ధరించిన చీరలు మహిళలను విపరీతంగా ఆకర్షించడంతో చెన్నై, ఆ పరిసరాల్లో ఇప్పుడు పలువురు వ్యాపారులు 'అరుంధతి' చీరలను మార్కెట్ లోకి ప్రవేశపెట్టి హాట్ హాట్ బిజినెస్ చేస్తున్నారు.
స్టార్స్ ను గుండెల్లోనే నిలుపుకొనే అభిమానులు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా స్టార్స్ పేరుతో వచ్చే ఉత్పత్తులను ఎగబడి కొనడం గతంలో చాలామార్లే జరిగింది. ఒకప్పుడు వాణిశ్రీ చీరలు, నగలు, నదియా గాజులు, పవన్ కల్యాణ్ డబుల్ ఫ్యాంట్ లు, ఇంద్ర షర్డ్ లు ఇలా...పలు ప్రోడక్ట్ లు మార్కెట్ లోకి వచ్చి అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు 'అరుంధతి' చీరల వంతు వచ్చింది. అనుష్క తన నటనతో మగవాళ్లను సమ్మోహితులను చేయడమే కాదు..ఆడవాళ్లను కూడా అరుంధతి చీరల వైపు పరుగులు పెట్టిస్తోంది. అతి త్వరలోనే 'అరుంధతి' నగలను కూడా డిజైన్ చేసి మార్కెట్ చేయబోతున్నారట. జనం కోరుకుంటే ఆర్థిక మాంద్యం ప్రభావం ఏపాటి?!
Be first to comment on this News / Article!
|