ప్రభాస్ 'ఏక్ నిరంజన్' షురూ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆదిత్యారామ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'ఏక్ నిరంజన్' అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ సమర్పకుడుగా కూడా వ్యవహిస్తున్నారు. ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ లోని లహరి పార్క్ లో మంగళవారంనాడు ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు.
ఆదిత్యారామ్ మాట్లాడుతూ, పూరీ జగన్నాథ్ ఎన్నో సరికొత్త సన్నివేశాలతో అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ను రెడీ చేశారనీ, ప్రభాస్ వంటి మంచి మనసున్న హీరోతో తన సొంత బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతుండటం సంతోషంగా ఉందనీ చెప్పారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పూరీ జగన్నాథ్ స్టయిల్ లో లావిష్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందనీ అన్నారు. ఏకథాటిగా జూలై నెలాఖరు వరకూ జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ప్రభాస్ తో చేస్తున్న పక్కా కమర్షియల్ మూవీ ఇదని పూరీ జగన్నాథ్ తెలిపారు. రొమాన్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ అన్నీ ఉన్న ఈ సబ్జెక్ట్ ను భారీగా తీస్తున్నామని చెప్పారు. పూరీ జగన్నాథ్ చెప్పిన కథ వింతో ఎంతో ఇన్ స్పైర్ అయ్యాయనీ, తన కెరీర్ లో ఇదో డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుందని ప్రభాస్ పేర్కొన్నారు. కంగనా రనౌత్ మాట్లాడుతూ, తాను అభిమానించే దర్శకుడు పూరీ జగన్నాథ్ అనీ, ఆయన దర్శకత్వంలో ఆదిత్య రామ్ బ్యానర్ లో దక్షిణాదిన పరిచయం అవుతుండటం హ్యాపీగా ఉందన్నారు. ప్రభాస్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం గ్యారెంటీగా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూ సూద్, ముఖుల్ దేవ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, పోసాని కృష్ణమురళి, ముకరంద్ దేశ్ పాండే, సంగీత తదితరులు నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, చిన్నా ఆర్ట్ , మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|