కూచిపూడి వెంకట్ 'నాట్ లక్కీ'
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శక్వం వహించిన 'అష్టా చమ్మ' చిత్రంలో ఒక హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ మరో కొత్త సినిమాలో హీరోగా నటించబోతున్నారు. అట్లాంటాలో స్థిరపడిన ఇండియన్ సతీష్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'నాట్ లక్కీ' అనే టైటిల్ ను నిర్ణయించారు. కూచిపూడి వెంకట్ దర్శకుడు.
చిత్ర విశేషాలను వెంకట్ తెలియజేస్తూ, 'అష్టా చమ్మ' చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా చక్కటి కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిదని చెప్పారు. ప్రముఖ దర్శకుడు నీలకంఠ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషమని అన్నారు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ పరిచయమవుతోందనీ, ఓం అనే యువనటుడు ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నారనీ చెప్పారు. 90 శాతం అమెరికాలో షూటింగ్ జరుపుతామని అన్నారు. జూన్ లో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఈ చిత్రానికి కూచిపూడి వెంకట్ కథ-మాటలు, కిరణ్ వారణాసి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|