'ప్రియమైన అంజలి' సాంగ్స్
విభిన్న ప్రేమకథా చిత్రం 'ప్రియమైన అంజలి'. గౌరీశంకర్, పూజా రోషన్ హీరోహీరోయిన్లు. ఎ.వి.రావు ఓ కీలక పాత్రను పోషించడంతో పాటు శ్రీ వెంకట సాయి ఆర్ట్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైద్రాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన 'ద్రోణ' చిత్ర నిర్మాత డి.ఎస్.రావు ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి ప్రతిని మరో అతిథి కృష్ణగౌడ్ కు అందజేశారు.
డిఎస్ రావు మాట్లాడుతూ, తాను గతంలో నిర్మించిన 'ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు' చిత్రానికి ఎ.వి.రావ్ అసోసియేట్ డెరెక్టర్ గా పనిచేశారనీ, సినిమారంగం అంటే ఆయనకు ఎంతో ఇష్టమనీ చెప్పారు. ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినిమాను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. సినిమా మ్యూజిక్ చాలా బాగుందనీ, సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాననీ అన్నారు. దర్శకనిర్మాత రావ్ మాట్లాడుతూ, లవ్, కామెడీ వంటి అంశాలన్నీ పొందుపరిచి సినిమా తీసినట్టు చెప్పారు. హీరోహీరోయిన్లు ఇద్దరూ కొత్తవారేననీ, అన్ని వర్గాల వారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. దర్శకుడు కె.వెంకటరమణ, శరత్ బాబు, సంగీత దర్శకుడు నవనీత్, హీరో గౌరీ శంకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|