'దుర్యోధనుడు'గా కళాభవన్
తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కళాభవన్ మణి ప్రధాన పాత్రల్లో, అభినయ్, రతి హీరోయిన్లుగా తమిళంలో విజయవంతమైన ఓ చిత్రం ఇప్పుడు 'దుర్యోధనుడు' పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. మీడియో ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ చిత్రానికి మణిరత్నం శిష్యుడు కె.దర్శన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ రెండో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మి మోసపోయే యువతులందరికీ కనువిప్పు కలిగేలా ఈ చిత్రం ఉంటుందనీ, అనేక కారణాలతో గడపదాటి బయటకు వచ్చిన యువతుల జీవితాలు మానవ మృగాలకు బలయిపోతున్నాయని వారు తెలిపారు. సాధారణంగా దుర్యోధనుడు పేరు చెబితే దుష్టపాత్ర గుర్తుకు వస్తుందనీ, అయితే ఈ చిత్రంలోని దుర్యోధనుడు ప్రేమ పేరుతో జీవితాలను బలి తీసుకుంటున్న యువతకు ఆదర్శంగా నిలుస్తాడనీ, తమిళంలో ఈ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ స్క్రిప్టు అవార్డు కూడా వచ్చిందనీ చెప్పారు. ఈ చిత్రంలో అభినయశ్రీ ఐటెం సాంగ్ హైలైట్ అవుతుందనీ, కణల్ కన్నన్ ఫైట్స్ కంపోజ్ చేయడంతో పాటు ఇందులో కామెడీ పాత్రను కూడా పోషించారనీ తెలిపారు. ఈ చిత్రానికి ప్రదీప్ మాటలు, ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|