నాగిరెడ్డి 'జ్ఞాపకాల పందిరి'
ప్రతిష్ఠాత్మక విజయా బ్యానర్ పేరు చెప్పగానే ఎన్నో అద్భుతమైన చిత్రరాజాలు కళ్లముందు మెదలుతాయి. 'మాయాబజార్', 'మిస్సమ్మ', 'గుండమ్మకథ', 'పాతాళ భైరవి'...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఆరేడు దశాబ్దాలకు పైగా వివిధ భాషల్లో చిన్నారులను అలరిస్తున్న 'చందమామ', ఎంతో కాలంగా సినీ ప్రియులను అలరిస్తూ వచ్చిన 'విజయచిత్ర' మ్యాగజైన్లు విజయా వారి కీర్తికిరీటాలు. విజయా వ్యవస్థాపకులైన బి.నాగరెడ్డి, చక్రపాణి దశాబ్దాల కృషికి ఇవన్నీ నిదర్శనాలు. విజయా బ్యానర్ ప్రస్తుత అధిపతి అయిన నాగిరెడ్డి తనయుడు బి.విశ్వనాథ రెడ్డి ఇప్పుడు ఓ బృహత్తరమైన ఆలోచనకు కార్యరూపం ఇవ్వబోతున్నారు. తెలుగు సినిమాపై పలు పుస్తకాలను ఆయన ప్రచురించి జనాల ముదుకు తీసుకు వెళ్లనున్నారు.
ఇవాల్టి ఎందరెందరో నిర్మాతలకు తన తండ్రి నాగిరెడ్డి స్ఫూర్తిగా నిలుస్తారనీ, ఆయన గురించి మరిన్ని వివరాలను అందించేందుకు విజయా ప్రచురణుల బ్యానర్ పై 'జ్ఞాపకాల పందిరి' అనే నాగిరెడ్డి బయోగ్రఫీని ప్రచురించనున్నామనీ విశ్వనాథ రెడ్డి తెలిపారు. 75 అజరామర చిత్రరాజాల గురించి వివరించే 'అలనాటి ఆనవాళ్లు' అనే మరో పుస్తకాన్ని కూడా ఈ నెలలోనే ఆయన విడుదల చేయబోతున్నారు. వీటికితోడు తెలుగు సినిమా ఎన్ సైక్లోపిడియా అనదగిన 'మాయాబబజార్' చిత్రం మేకింగ్ నాటి విశేషాలను పొందుపరుస్తూ ఓ ప్రత్యేక సీడీని కూడా రూపొందిస్తున్నట్టు ఆయన వివరించారు.
Be first to comment on this News / Article!
|