100 ప్రింట్లతో 'టార్గెట్'
ముమైత్ ఖాన్, శివబాలాజీ, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం 'టార్గెట్'. సిరి సాయి సూర్యా మూవీస్ పతాకంపై సంగిశెట్టి దశరథ, రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రమేష్ రాజా దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈనెల 24న ఈ చిత్రాన్ని 100 ప్రింట్లతో విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు. గురువారంనాడు హైద్రాబాద్ లో ఆ విశేషాలను తెలియజేశారు.
ఇది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమనీ, హీరోహీరోయిన్లు పాత్రోచితంగా వేసే ఎత్తుకు పైఎత్తులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయనీ వారు తెలిపారు. కథకు అనుగుణంగా వివిధ లొకేషన్లలో ఈ చిత్రాన్ని తీశామని, ముఖ్యంగా బెంగుళూరు వద్ద తీసిన ఓ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ చెప్పారు. అలాగే సినిమాలోని సల్సా డాన్స్ సాంగ్ లో హీరోహీరోయిన్లు ముగ్గురూ నటించారని తెలిపారు. శివబాలాజీ, ముమైత్ ఖాన్ ఫైట్ దృశ్యాలు చాలా బాగా వచ్చాయన్నారు. ముమైత్ గ్లామర్ తో పాటు యాక్షన్ దృశ్యాల్లో చక్కటి ప్రతిభా పాటవాలు ప్రదర్శిచిందని అన్నారు. ఇటీవల విడుదలైన ఆడియో శ్రోతలను ఎంతగానో అలరిస్తోందని తెలియజేశారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణ భగవాన్, రియాజ్ ఖాన్, జీవా, సైరాభాను, విశ్వజిత్ ప్రదాన్, వేణుమాధవ్, కొండవలస, వల్లభనేని జనార్ధన్, గీతాసింగ్ తదితరులు నటించారు.వెలిగొండ శ్రీనివాస్ మాటలు, వి.ఎన్.సురేష్ కుమార్ సినిమాటోగ్రఫీ, కె.రమేష్ ఎడిటింగ్, విజయ్ ఫైట్స్, కోటి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|