ప్రభాస్ 'డార్లింగ్' రెడీ...
స్టార్ హీరోలతో పాటు యువ హీరోలంతా ఏడాదికి ఒక చిత్రానికే పరిమితవుతుండగా యువ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈసారి స్ప్రింట్ కొట్టబోతున్నారు. ఈ ఏడాది కాస్త అటూ ఇటుగా ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ శుక్రవారమే ప్రభాస్ 'బిల్లా' చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందుకు తగ్గట్టే హెవీ క్రౌడ్స్ తో థియేటర్లు కిటకిలలాడుతున్నాయి. వీకెండ్ కావడంతో ఆదివారం వరకూ జంట నగరాల్లోని ప్రధాన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ లు కూడా క్లోజ్ అయ్యాయి. మరోవైపు ప్రభాస్ తన తదుపరి చిత్రమైన 'ఏక్ నిరజంన్ ' చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
'బుజ్జిగాడు' చిత్రం తర్వాత ప్రభాస్, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య బాబు నిర్మిస్తున్నారు. ఆగస్టు నాటికి సినిమా పూర్తవుతుంది. దీనికితోడు ప్రభాస్ మరోసారి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న భారీ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన 'ఛత్రపతి' చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ గతంలో నిర్మించారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి కరుణాకరన్ ('తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' ఫేమ్) దర్శకత్వం వహించనున్నారు. 'తొలిప్రేమ' తరహాలోనే చక్కటి రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈ చిత్రం ఉండబోతోంది. దీనికి 'డార్లింగ్' అనే టైటిల్ ను నిశ్చయించారు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|