'కింగ్ ' శతదినోత్సవం
నాగార్జున, త్రిష కాంబినేషన్ లో శ్రీనువైట్ల దర్శకత్వంలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన 'కింగ్' చిత్రం గత డిసెంబర్ లో విడుదలైన ఈ శుక్రవారంతో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు శ్రీనువైట్ల, శివప్రసాద్ రెడ్డి తనయుడు చందన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒక వినూత్న తరహా కథనంతో రూపొందించిన 'కింగ్' చిత్రం ప్రేక్షకాదరణ పొందడం సంతోషంగా ఉందనీ, శివప్రసాద్ రెడ్డి ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారనీ, ఆదరించిన ప్రేక్షకులందరికీ తన కృతజ్ఞతలనీ శ్రీనువైట్ల తెలిపారు. ముఖ్యంగా బి సెంటర్ల కన్నా ఎ సెంటర్లకు సినిమా బాగా రీచ్ అయిందనీ, నాగార్జునతో మరో చిత్రాన్ని అన్ని వర్గాల వారికీ రీచ్ అయ్యేలా చేయాలనుకుంటున్నాననీ తెలిపారు. త్వరలో వెంకటేష్ హీరోగా నటించనున్న చిత్రానికి దర్శకత్వం వహించనున్నాననీ, వచ్చే ఏడాది నాగచైతన్య తో తన దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని చెప్పారు . 'కింగ్' 100 రోజుల వేడుక త్వరలోనే జరుగుతుందని తెలిపారు. శ్రీనువైట్ల తమ బ్యానర్ కు 'కింగ్'తో మంచి హిట్ ఇచ్చారని చందన్ తెలిపారు. కాగా, నాగార్జున-శ్రీనువైట్ల కాంబినేషన్ లో పనిచేయడం తనకు ఎంతో సంతోషం కలిగించిందనీ శివప్రసాద్ రెడ్డి తెలియచేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే తన తదుపరి చిత్రం మళ్లీ నాగార్జునతోనే ఉంటుందనీ, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ ఆయన వెల్లడించారు.
Be first to comment on this News / Article!
|