రజనీ కడపు 'చల్ల'గా...
మండుటెండల్లో సేదతీరాలంటే 'చల్ల '(మజ్జిగ)కు మించిన దివ్యౌషధం మరొకటుండదు. 'చల్ల' చలచల్లగా కడుపులోకి జారుతుంటే అసలట ఇట్టే మాయమవుతుంటుంది. అందుకే వేసవిలో చలివేంద్రాలు, చల్ల సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా వీటిని సరఫరా చేస్తుంటారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల మండుటెండల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న కూలీలకు స్వయంగా తన చేతుల మీదుగా మజ్జిగ సర్వ్ చేసి సాటి మనుషుల పట్ల తనకున్న ఔదార్యాన్ని, మంచి మనసును చాటుకున్నారు.
రజనీకాంత్ తీరిక వేళ్లలో చెన్నైలోని కేలంబాక్కంలో ఉన్న తన ఫామ్ హౌస్ కు వెళ్తుంటారు. కొద్దిరోజులుగా శంకర్ దర్శకత్వంలో హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'యంతిరిన్' (రోబో) షూటింగ్ లో పాల్గొంటున్న రజనీకాంత్ ఈమధ్య కొద్దిగా బ్రేక్ రావడంతో ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ కూలీలు మండుటెండలో పని చేస్తుండం చూసిన రజనీకాంత్ వారందరికీ మజ్జిగ సరఫరా చేయాల్సిందిగా తన సిబ్బందికి పురమాయించారు. అప్పటికప్పుడు మజ్జిగ తెప్పించి స్వయంగా తన చేతుల మీదుగానే వారికి సర్వ్ చేశారు. దీనికితోడు ఆ ఏరియా మీదుగా వెళ్లున్న పాదచారుల కోసం ఫామ్ హౌస్ సమీపంలో ఒక షెడ్ వేయించి మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆరోజంతా రజనీ స్యయంగా మజ్జిగ పంచుతున్నారని తెలిసి అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చి రజనీ ఔదార్యాన్ని వేనోళ్ల కొనియాడారు.
Be first to comment on this News / Article!
|