జయసుధ బికినీ!
ప్రియమణి, అనుష్క, నమిత బికినీ షోలు ఇప్పుడు వెండితెరను కమ్మేస్తున్నాయి. బికినీ ఇంకెంతమాత్రం 'స్కిన్ షో 'గా పరిగణించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇదే బాటలో మరింతమంది తారలు కూడా బికినీ ప్రదర్శనలకు రెడీ అవుతున్నారు. సినీ గ్లామర్ ప్రపంచంలో ఇది సహజ ప్రక్రియే అయినా...ప్రస్తుతం ఎన్నికల వేడి అన్ని పార్టీల్లోనూ నషాలానికి అంటుతుండటంతో పనిలో పనిగా కొందరు రాజకీయ ప్రత్యర్థులు స్టార్ కంటెస్టెంట్ లు, ప్రచార బరిలోకి దిగుతున్న తారలపై బురద చల్లేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈమధ్యనే 'రోజా'ను పోలిన అశ్లీల క్లిప్పింగ్ లు జోరుగా నెట్స్ లోకి, అట్నించి అటు జనాల్లోకి ఫార్వార్డ్ అవుతూ వచ్చాయి. తెలుగుదేశంలో చేరిన నటి కవితకూ ఈ పరిస్థితి తప్పలేదు. ఇటీవల కొన్ని సెమీ-న్యూడ్ ఫోటోలు నెట్స్ లోకి చొరబడ్డాయి. అయితే ఇవి ఏదో సినిమా కోసం తీసిన క్లిప్పింగ్స్ అనేది వీటిల్లో స్పష్టమవుతుంది. తాజాగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ జయసుధ బికినీ ఫోటోలు కూడా నెట్ లో స్వైరవిహారం చేస్తున్నారు.
ఈ ఫోటోల్లో జయసుధ బికినీలో బీచ్ ఒడ్డున నవ్వుతూ కనిపిస్తుంటుంది. సుమారు 25 ఏళ్ల క్రితం జయసుధ హీరోయిన్ గా మంచి డిమాండ్ లో ఉన్నప్పుడు ఒక సినిమా కోసం తీయించుకున్న ఫోటోలివి. నిజానికి ఇప్పుడు ఈ ఫోటోలు బయటకు తీయాల్సిన అవసరమైతే లేదు. తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు చేసినా ఆ తర్వాత క్రమంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి సహజనటి అనిపించుకున్నారు. ప్రస్తుతం నేటి యువతరం హీరోలకు అమ్మగా డిగ్నిఫైడ్ పాత్రలు చేస్తున్నారు. నటీమణులు రాజకీయాల్లోకి రావడం కత్తి మీద సామేనని రోజా, కవిత, జయసుధలకు ఎదురవుతున్న చేదు అనుభవాలే నిదర్శనం.
Be first to comment on this News / Article!
|