కావేరి రొమాంటిక్ 'ఊహాచిత్రం'
మంచి హైట్, అందుకు తగిన అందం కావేరీ ఝా ఎస్సెట్స్. గ్లామర్ ప్రదర్శనకు ఏమాత్రం వెనుకంజ వేయకున్నా సరైన హిట్ మాత్రం ఆమె విషయంలో దోబూచులాడుతోంది. జగపతిబాబుతో 'నగరం', శివాజీతో 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్' చిత్రాల్లో కావేరీ ఝా నటించినప్పటికీ అదృష్టం ఇంకా తలుపుతట్టలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 'ఊహాచిత్రం'తో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు సత్య రూపొందిస్తున్నారు. కావేరీ ఝా సరసన వంశీకృష్ణ హీరోగా పరిచయమవుతున్నారు. లిఖిత్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.పైడిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది.
కథలో కీలకమైన పాత్రు కావేరీ ఝా పోషిస్తోందనీ, అందంతో పాటు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రను ఇందులో ఆమె పోషించారనీ దర్శకుడు సత్య తెలిపారు. కొత్త హీరో అయినా వంశీకృష్ణ పరిణతి చెందిన నటన ప్రదర్శించాడనీ, ఈనెల 12న మధుర మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నామనీ చెప్పారు. పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఈ ఆడియో వేడుకకు హాజరుకానున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్ర్లలో జీా, సూర్య, బబ్లూ, శ్రీధర్ తదితరులు నటిస్తున్నారు. సురేంద్ర కృష్ణ మాటలు, వి.ఎస్.సురేష్ కుమార్ సినిమాటోగ్రఫీ, శివ ఆర్ నందిగామ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|