హీరోయిన్ తో కన్మణి పెళ్లి
తమిళ దర్శకుడు కన్మణి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. వడ్డే నవీన్ హీరోగా 'నా ఊపిరి' సుమంత్ తో 'చిన్నోడు' వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఈమధ్యనే ఆయన 'కాల్ సెంటర్' అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ చిత్రం సి గ్రేడ్ స్థాయిలో ఉందంటూ ప్రేక్షకులు తిప్పికొట్టారు. సినిమా మాటెలా ఉన్నా ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రవళితో ఆయన ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లిగా మారబోతోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగికరించడంతో త్వరలోనే ముహూర్తం నిర్ణయించనున్నారు.
వృత్తిపరంగా కన్మణి ఈసారి ఎలాగైనా మంచి హిట్ సాధించాలనే పట్టుదలతో 'పరిమళ్' అనే చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సంధ్య ('ప్రేమిస్తే' ఫేమ్) కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, తెలుగు వెర్షన్ పనులు పూర్తి కావలసి ఉన్నాయి. మే20న ఈ చిత్రాన్ని ఏకకాలంలో రెండు భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక రవళితో వివాహానంతరం కూడా ఆమె నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలు కన్మణి చెబుతున్నారు.
Be first to comment on this News / Article!
|