'టిక్ టిక్ టిక్' సాంగ్స్
కృష్ణ భగవాన్, వేణుమాధవ్, షరీఫ్, సైరాబాను, ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'టిక్ టిక్ టిక్'. అరుణోదయ ఫిలిమ్స్ పతాకంపై అరుణకాంత్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. అన్నపూర్ణా స్టూడియోస్ లో ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. నటి అనుష్క, దర్శకుడు కోడి రామకృష్ణ, పాజిటివ్ డెంటల్ కు చెందిన డాక్టర్ సంధ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనుష్క ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని కోడి రామకృష్ణకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
కోడిరామకృష్ణ మాట్లాడుతూ, దర్శకనిర్మాత ఒకరే అయినపుడు సహజంగానే రిస్క్ ఉంటుందనీ, ఈ చిత్రం పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే అరుణ్ కాంత్ కు తప్పనిసరిగా సక్సెస్ లభిస్తుందని తనకు అనిపిస్తోందని అన్నారు. అరుణ్ కాంత్ తనకు మూడేళ్లుగా తెలుసనీ, దర్శకుడుగా తనకు మంచి సృజనాత్మక శక్తి ఉందని ఈ చిత్రంలో ఆయన చాటుకున్నారని అనుష్క పేర్కొన్నారు. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. హాలీవుడ్ చిత్రాలు చూడటం మొదట్నించీ తనకు అలవాటనీ, ఆ తరహాలో మనం ఎందుకు ప్రయోగాలు చేయకూడదని అనిపించి ఈ చిత్రాన్ని తీశాననీ అరుణ్ కాంత్ పేర్కొన్నారు. ఇది కూల్..స్పైసీ..సస్పెన్స్ థ్లిల్లర్ అని తెలిపారు. ఇందులో మిలట్రీ ఆఫీసర్ గా నటించినట్టు నర్సింగ్ యాదవ్ పేర్కొనగా, సంగీత దర్శకుడిగా తనకిది తొలి చిత్రమని కానూరి తెలిపారు. నటీనటులు షరీఫ్, ప్రేమ, సినిమాటోగ్రాఫర్ జాన్, గీత రచయిత రాంబాబు, గ్రాఫిక్ డిజైనర్ అనిల్ కుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|