రవితేజ 'కిక్' ఆడియో 19న
'ఖతర్నాక్' జంట రవితేజ, ఇలియానా మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'కిక్'. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ('అతిథి' ఫేమ్ ) దర్శకుడు. ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. విదేశాల్లో షూటింగ్ ముగించుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది.
రవితేజ-ఇలియానా కాంబినేషన్ లో చక్కటి ఎంటర్ టైనర్ ఈ చిత్రం రూపొందుతోందనీ, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 వరకూ యూరప్ లోని ఇటలీ, ఆస్ట్రియా, మలేషియాలలో మూడు పాటలు, కొంత టాకీ, ఓ ఛేజ్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు సురేందర్ రెడ్డి తెలిపారు. ఇందులో రవితేజ క్యారెక్టరైజేషన్ హైలైట్ అవుతుందన్నారు. తమిళ హీరో శ్యామ్ పోషించిన ప్రధాన పాత్ర మరో హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, రవితేజ-ఇలియానాపై యూరప్ లో రెండు పాటలు, మలేషియాలో మరో పాట, రవితేజ-శ్యామ్ లపై 12 రోజుల పాటు ఛేజ్ ఇటీవల చిత్రీకరించామనీ, ఆ తర్వాత హైద్రాబాద్ లో షూటింగ్ జరిపామని అన్నారు. ఆదివారంతో ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందన్నారు. ఈనెల 19న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నట్టు సహనిర్మాత వి.సురేష్ రెడ్డి తెలిపారు. మే నెల మొదటివారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆషిక, బ్రహ్మానందం, కోట, వేణుమాధవ్, ఆలీ, సాయాజీ షిండే, నళిని, ప్రభ తదిరులు నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి కథ, అబ్బూరి రవి-వక్కంతం వంశీ మాటలు, సీతారామశాస్త్రి పాటలు, రసూల్ సినిమాటోగ్రఫీ, విజయ్ స్టంట్స్, ఎస్.థామస్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|