'రాత్రి' పాటలు విడుదల
సాయాజీ షిండే, ప్రీతిమెహ్రా తదితరులు నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'రాత్రి'. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై భానుకిరణ్ దర్శకత్వంలో ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రం ఆడియో విడుక నిర్వహించారు. తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి క్యాసెట్ ను వి.ఎన్.ఆదిత్యకు అందజేశారు. గేయరచయిత చంద్రబోస్ ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి నటుడు ఏవీయస్ కు అందజేశారు.
యువతరం దర్శకులు మంచి సాంకేతిక విలువలతో సినిమాలు తీస్తున్నారనీ, అయితే ఎక్కువ మంది ఒక్క సినిమాతోనే కనుమరుగవుతున్నారనీ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన సాయాజీ షిండే ఇప్పడికే తెలుగులో మంచిపేరు తెచ్చుకుంటున్నారనీ, ఓ ఛాలెంజింగ్ పాత్రను ఆయన ఇందులో పోషించారనీ అన్నారు. యూనిట్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఏవీఎస్ మాట్లాడుతూ, సాయాజీ షిండే మొదట్నించీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంటున్నారనీ, అలాగే నేటి కొత్త దర్శకులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారనీ, ఈ చిత్ర దర్శకుడికి కూడా ఇదో మంచి చిత్రం అవుతుందని అన్నారు. గీత రచయిత సదా, సంగీత దర్శకుడు ప్రమోద్ కు ఇదో మంచి చిత్రమవుతుందని చంద్రబోస్ ఆశాభావం వ్యక్తం చేశరు. ఈ వేడుకలో భానుకిరణ్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|