కొత్త తారలతో 'బ్లాక్ క్యాట్'
నూతన తారలతో సస్పెన్స్ ప్రథానాంశంగా 'బ్లాక్ క్యాట్' అనే కొత్త చిత్రం హైద్రాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో సోమవారం ప్రారంభమైంది. పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బంగారు బాయ్యరెడ్డి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి శివాజీ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, జాజిమల్లి వాసు కెమెరా స్విచ్చాన్ చేశారు.
దర్శకనిర్మాత బాయ్యరెడ్డి మాట్లాడుతూ, గెస్ట్ హౌస్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ ప్రధానంగా ఉండే ఈ చిత్రంలో అంతా కొత్తతారాలే ఉంటారనీ, అయితే ప్యాడింగ్ కోసం కృష్ణభగవాన్, సన వంటి సీనియర్ ఆర్టిస్టులను కూడా తీసుకున్నామనీ చెప్పారు. పది రోజుల షూటింగ్ తర్వాత వరంగల్ వెళ్తామన్నారు. కృష్ణ భగవాన్ మాట్లాడుతూ, ఇందులో తనది ఒకరోజు వేషమనీ, అయితే సినిమా మొత్తం కనిపిస్తాననీ చెప్పారు. సన మాట్లాడుతూ, కథే ప్రధానంగా సాగే చిత్రమిదనీ, కృష్ణ భగవాన్ కు జోడీగా నటిస్తున్నాననీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో దేవరాజ్, శ్రీతేజ, వర్మఇత, రామకృష్ణ, బాబూరావు, తిరుపతి ప్రకాష్ తదిరులు నటిస్తున్నారు. నరసింహ మాటలు, డాడీ శ్రీను-తాటి శివ మాటలు, బొర్లగడ్డ సినిమాటోగ్రఫీ, ప్రేమ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|