మూడో వారంలో 'అధినేత'
ప్రైమ్ స్టార్ జగపతిబాబు హీరోగా వి.సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న రాజకీయ చిత్రం 'అధినేత'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.
థాయ్ లాండ్ లోని బ్యాంకాక్, పటాయ పుకెట్ ఐలాండ్స్ లో ఎవరూ షూచ్ చేయని అధ్భుతమైన లొకేషన్లలో ఇటీవల రెండు పాటలు చిత్రీకరించామనీ, ఇవి రెండూ చిత్రానికి హైలైట్ అవుతాయని నిర్మాత రాధామోహన్ తెలిపారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయిందనీ, సినిమా చాలా లావిష్ గా తీశామనీ చెప్పారు. ఏప్రిల్ మూడో వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. సముద్ర మాట్లాడుతూ, జగపతిబాబు కెరీర్ లోనే ఇది సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందని అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించామనీ, ఎన్నికల సీజన్ లో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శ్రద్దాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతిప్రసాద్, ఆనందరాజ్, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు, కృష్ణభగవాన్ తదితరులు నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ-మాటలు, ప్రసాద్ బాబు సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, డిఫరెంట్ డానీ ఫైట్స్, శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|