సరికొత్త వేదికపై బన్నీ బర్త్ డే
స్యయం ప్రతిభతో యూత్ లో తనకంటూ ప్రత్యేకమై స్థానం ఏర్పరచుకున్న స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ నేడు మరో వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈసారి తన బర్త్ డే వేడుకను సైతం సరికొత్త వేదికను ఎంచుకుని అభిమానులకు మరింత దగ్గరవుతున్నాయి. సహజంగా ఈ వేడుకను షూటింగ్ సెట్స్ లోనో, స్నేహితుల మధ్యనో జరుపుకొనే బన్నీ ఈసారి అనకాపల్లిలో పిఆర్ పి తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్న తన తండ్రి అల్లు అరవింద్ తరఫున రాజకీయ ప్రచారం చేపడుతూ అభిమానుల మధ్యే కేక్ కట్ చేసి సందడిగా బర్త్ డే జరుపుకొంటున్నారు. తన తండ్రిని గెలిపించాలనీ, మామయ్యకు అందరూ అండగా నిలబడాలనీ ఆయన కోరుతున్నారు. ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగడానికి మామయ్య చిరంజీవి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగానే చిరంజీవి పోటీచేస్తున్న పాలకొల్లులో కూడా బన్నీ ప్రచారం చేసే అవకాశాలున్నాయి.
ఎన్నికల సందడి పూర్తికాగనే అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ సందడి కూడా మొదలవుతుంది. ఆయన కెరీర్ కు ప్రారంభంలోనే మంచి బ్రేక్ ఇచ్చిన'ఆర్య' చిత్రం ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. 'ఆర్య' దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ శరవేగంగా రూపొందుతోంది. మూడు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తయింది. దీనికితోడు తన తదుపరి చిత్రంగా గుణశేఖర్ దర్శకత్వంలో మరో సినిమాకి కూడా అల్లు అర్జున్ కమిట్ అయ్యారు. ఆగస్టులో 'ఆర్య-2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|