రెండో విడత 'ప్రజానాయకుడు'
పాత కొత్త తారలతో రాజకీయ కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'ప్రజా నాయకుడు'. అమ్మ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.సి.ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది. ఈ చిత్రంలో నటిస్తున్న తారలే ఆడియోను విడుదల చేయడం విశేషం. చిరంజీవికి డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ ఆడియో సీడీని ఆవిష్కరించి వై.ఎస్.కు డూప్ గా నటిస్తున్న జానీ, చంద్రబాబు డూప్ రవికి అందజేశారు.
ఎడిటర్ షేక్ బాషా రాసిన రాజకీయ కథాశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకనిర్మాతలు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజాస్వామ్యం విలువలను తెలియచేస్తూ చక్కటి సందేశంతో ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పారు. మంచి కమర్షియల్ విలువలు కూడా సినిమాలో ఉన్నాయని అన్నారు. రెండవ విడత పోలింగ్ నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కథా రచయి., నిర్మాణ సారథి ఎడిటర్ షేక్ బాషా, సంగీత దర్శకుడు విద్యాధరణి సాయి, తదితరులు పాల్గొన్నారు. దేవి ఆడియో ద్వారా ఆడియో విడుదలైంది.
Be first to comment on this News / Article!
|