బెండప్పారావుతో కామ్న!
కామ్న జెఠ్మలానీ గుర్తుంది కదా. 'ప్రేమికులు' చిత్రంతో పరిచయమై కొన్ని హిట్ చిత్రాల్లో కూడా నచించింది. 'రణం', 'సామాన్యుడు' వంటి హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయినప్పటికీ సినిమాల పరంగా ఇటీవల కాలంలో ఆమెకు బ్రేక్ వచ్చింది. ఈమధ్యనే నాగార్జున 'కింగ్' చిత్రంలో చివర్లో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ లో మెరుపులా మెరిసింది. ఎట్టకేలకు కామ్న నిరీక్షణ ఫలించి ఇప్పుడు సోలో హీరోయిన్ గా మరో ఛాన్స్ దక్కింది. అది కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కావడం విశేషం. అల్లరి నరేష్ కథానాయకుడుగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మిస్తున్న చిత్రంలో కామ్న హీరోయిన్ గా ఎంపికైంది.
అల్లరి నరేష్ కు జోడిగా కామ్న ఈ సారి గ్లామర్ ప్రదర్శనతో కూడా కామెడీకి కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రను పోషించబోతోందని తెలుస్తోంది. తొలుత దిశా పాండే అనే కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నప్పటికీ రెండ్రోజుల షూటింగ్ తర్వాత ఏవో కారణాల వల్ల ఆమె తప్పుకుంది. దీంతో ఆ ప్లేస్ లో కామ్న వచ్చి చేరింది. గతంలో కామ్నకు అవకాశమిస్తానని రామానాయుడు ప్రామిస్ చేశారనీ, ఇప్పుడు ఆ మాట నిలుపుకొన్నారనీ సినీ వర్గాల కథనం. ఉగాదికి ఈ చిత్రం సైలెంట్ గా సెట్స్ మీదకు వచ్చి శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. 'ఫిట్టింగ్ మాస్టర్' తరహాలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఇవివి ఈసారి తనదైన స్టయిల్ లో ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు. దీనికి ఇవివి సినిమాల టైటిల్స్ తరహాలోనే 'బెండప్పారావు ఆర్ఎంపి' అనే టైటిల్ ను అనుకుంటున్నారు.
సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ముందుగానే అల్లరి నరేష్ 'ఆకాశరామన్న' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
Be first to comment on this News / Article!
|