టార్గెట్ చేరిన 'మేస్త్రి' : దాసరి
అంత ఉలుకెందుకు?
'ప్రజారాజ్యం' పార్టీని విమర్శించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది కదా అని దాసరిని ప్రశ్నించినప్పుడు 'వ్యక్తిగత విమర్శలకో, అవమానించడానికో ఈ సినిమా తీయలేదు. ఇది సామాజిక రాజకీయ ఇతివృత్తం కాబట్టి పలు అంశాలు చర్చించామంతే. దీనికి ఎవరూ భుజాలు తడుముకోవాల్సిన పని లేదు. ఒసేయ్ రాములమ్మ సినిమా కూడా అప్పట్లో తీశాం. నాయకులను అందులోనూ విమర్శించాం. అంతెందుకు. ఎమ్మెల్యే ఏడుకొండులు సినిమా తీసినప్పుడు చెన్నారెడ్డిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీశామని ప్రచారం చేశారు. నేనూ, చెన్నారెడ్డి కలిసి ఆ సినిమా చూశాం. ఇప్పుడు మేస్త్రిలోనూ మంచి సందేశం ఇచ్చాం. అది తెలుసుకోవాలంటే అంతా సినిమా చూడండి' అని సమాధానమిచ్చారు. కాంగ్రెస్ కు ఎన్నికల ప్రచారం చేపట్టే అంశంపై అడిగిన మరో ప్రశ్నకు 'ప్రచారం మొదలుపెట్టినప్పుడు మీకు చెప్పే చేస్తాను. సరేనా' అంటూ నవ్వేశారు.
దళితుడి పాత్ర నా సుకృతం
మోహన్ బాబు మాట్లాడుతూ, దళితుడిగా ఇందులో అద్భుతమైన పాత్ర పోషించడం, అందులోనూ గురువుగారు దాసరి చిత్రంలో చాలా గ్యాప్ తర్వాత నటించడం మంచి అనుభూతిని కలిగించిందని చెప్పారు. అలాగే తన పాత్రకు రోమాలు నిక్కబొడిచే డైలాగ్ కు కూడా ఉన్నాయన్నారు. యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, యూనివర్శిటీలకు చెందిన మేథావులు, విద్యార్థులు సినిమా చూసి మంచి సందేశాత్మక చిత్రంగా ప్రశంసిస్తున్నారని చెప్పారు. ఈ సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే అంశాలతో పాటలు రాసే అవకాశం గురువు దాసరి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అశోక్ తేజ పేర్కొన్నారు.

Be first to comment on this News / Article!
Pages: -1- 2
|