50 ప్రింట్లతో 'ఆనందతాండవం'
తమన్నా, సిద్దార్ధ (తొలిపరిచయం), రుక్షిణి ప్రధాన పాత్రల్లో ఆస్కార్ ఫిలింస్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించిన 'ఆనంద తాండవం' చిత్రం ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను ఎస్.వి.ఆర్.మీడియా అధినేత్రి శోభారాణి ప్రేక్షకులకు అందిస్తున్నారు.50 ప్రింట్లతో ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆమె తెలిపారు.
ఎస్.వి.ఆర్. మీడియా కార్యాలయంలో బుధవారంనాడు ఆమె మాట్లాడుతూ, విదేశాల్లో సెటిల్ కావాలనే మోజలో పడి కొట్టుమిట్టాడుతున్న యువతకు కనువిప్పు కలిగేలా మంచి సందేశంతో ఈ చిత్రం రూపొందినట్టు చెప్పారు. వరుసగా పెద్ద మ్యూజికల్ హిట్స్ ఇస్తున్న ఆస్కార్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి మ్యూజడికల్ చిత్రమిదని చెప్పారు. ఇందులో ఒక పాట సెట్ లో తీస్తే, మిగిలినవన్నీ విదేశాల్లో తీశారనీ, సాంగ్స్ కు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందనీ అన్నారు. తమన్నా, సిద్దార్ద చాలా చక్కగా నటించారనీ, క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీస్ వంటి అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం తప్పనిసరిగా అలరిస్తుందనీ చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలవుతోందని అన్నారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, జీవా శంకర్ సినిమాటోగ్రఫీ, వి.టి.విజయన్ ఎడిటింగ్, జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|