'సరే నీ ఇష్టం' సాంగ్స్ 10న
ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజా తనయుడు శాంతన్ భాగ్యరాజాను కథానాయకుడిగా పరిచయం చేస్తూ పూర్ణచంద్ర మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ చంద్ర, రమేష్ రెడ్డి, జీవితరెడ్డి, సామారెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం 'సరే నీ ఇష్టం'. మహేష్ చంద్ర దర్శకుడు. శాంతన్ కు జోడిగా అంద్రిత నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుపుకొంటోంది. ఈనెల 10న లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నట్టు మహేష్ చంద్ర తెలిపారు.
రవీంద్రభారతిలో జరుగనున్న ఆడియో వేడుకకు పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే సంగీత భరిత ప్రేమకథా చిత్రమిదనీ, అన్ని కమర్షియల్ హంగులూ ఈ చిత్రంలో ఉన్నాయనీ అన్నారు. చక్రి సంగీతంలో రూపుదిద్దుకున్న ఆరు పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. బ్యాంకాక్, పుకెట్, పటాయ్ లలో చాలా రిచ్ గా రెండు పాటలు చిత్రీకరించామనీ, మరో పాటను సెట్ వేసి రొమాంటిక్ గా తీశామని తెలిపారు. ఇదే సమ్మర్ సీజన్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగబాబు, సాయాజీ షిండే, కోట, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, బాబుమోహన్, సుధాకర్, అన్నపూర్ణ, సన, కౌష, అపూర్వ తదితరులు నటిస్తున్నారు. ఎ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, హార్స్ మన్ బాబు ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు. ఎ.దేవేష్ (యుఎస్ఎ) చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|