రెహ్మాన్ ట్యూన్ కాపీ కొట్టకుండా
రెండు ఆస్కార్ లు గెలుచుకున్న ఎ.ఆర్.రెహమాన్ ఇప్పుడు దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళంలో తీస్తున్న ఓ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో విశేషం లేకపోవచ్చు కానీ, ఈ చిత్రంలోని రెహ్మాన్ ట్యూన్స్ ఎవరూ కాపీ కొట్టకుండా దర్శకుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అందర్నీ ఆకట్టుకుంటోంది. శింబు, త్రిష జంటగా గౌతమ్ మీనన్ తన తాజా చిత్రాన్ని కేరళలోని అలెప్పీలో చిత్రీకరిస్తున్నారు. హీరోహీరోయిన్ల జంటపై కేరళ జలాల బ్యాక్ డ్రాప్ లో ఓ పాట చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ఇందుకోసం ఓ హౌస్ బోట్ ను కూడా అద్దెకు తీసుకున్నారు.
గౌతమ్ మీనన్ తీస్తున్న పాటకు ఎ.ఆర్.రెహమాన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారట. సహజంగా పాట చిత్రీకరణ సయంలో రికార్డు ప్లేయర్ లో పాటను ప్లే చేయడం, పాటలోని పదాలకు తగ్గట్టుగా (కొరియోగ్రాఫర్ సూచనలు మేరకు) హీరోహీరోయిన్లు పెదాలు కదపడం చేస్తుంటారు. అయితే శింబు, త్రిషలపై పబ్లిక్ లో పాట తీయడాననికి ప్లాన్ చేయడంతో సహజంగా జనం తాకిడి ఎక్కువగా ఉంటోందట. ఇది గ్రహించిన గౌతమ్ మీనన్ ఆ పాట బయటకు పొక్కకుండా చిత్రయూనిట్ కు తగిన సూచనలు ఇస్తూ పాట చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే పాట చిత్రీకరణతో ప్రమేయం ఉన్న యూనిట్ సభ్యులందరికీ హెడ్ ఫోన్స్ జోడించిన రికార్డర్ అందుబాటులో ఉంచుతున్నారు. పాట సాహిత్యాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అందుకు అనుగుణంగా లిప్ మూమెంట్ ఇవ్వాలని త్రిష, శింబులకు సూచనలు ఇస్తున్నారు. ప్రతి షాట్ కు ముందు లిరిక్ వినడానికి వారికి తగిన సమయాన్ని కూడా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని ప్రిస్టేజియస్ చిత్రాల పాటలు ఆడియో రిలీజ్ కు ముందే బయటకు లీక్ అవుతుండటం, 'జయ హో' సాంగ్ తర్వాత రెహ్మాన్ ఇచ్చే ట్యూన్స్ పై ఉండే క్రేజ్ గౌతమ్ మీనన్ ముందు జాగ్రత్తకు కారణాలుగా అనుకోవచ్చు. మొత్తానికి గౌతమ్ కొత్త టెక్నిక్ మరికొందరికి స్ఫూర్తి కావచ్చు కూడా.
Be first to comment on this News / Article!
|