తమన్నాకు అడ్వాన్స్ హిట్
సరిగ్గా వారం రోజుల గ్యాప్ లో రెండు రిలీజ్ లు. ముందుగా రిలీజైన సినిమా డిక్లేర్డ్ హిట్. మరో హిట్ ఊరిస్తోంది. యువతరం ప్రేక్షకులలో తనకుంటూ ప్రత్యేకత ఏర్పరచుకుని తన సహచర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న నటి తమన్నా గురించే ఈ ముచ్చట. తెలుగులో 'హ్యాపీడేస్' చిత్రంలో యువత కలల రాణిగా మంచిపేరు తెచ్చుకున్న తమన్నా ఇక్కడ కంటే తమిళంలోనే మంచి మార్కెట్ దక్కించుకుంది. హీరో సూర్య (తమిళ 'గజనీ' ఫేమ్)కు జంటగా తమన్నా నటించిన 'అయన్' చిత్రం ఈనెల 3న విడుదలై డిక్లేర్డ్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'వీడొక్కడే' పేరుతో అనువదిస్తున్నారు. తొలుత రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల ముందుగా తమిళంలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడంతో తమన్నా ఆనందానికి అవధులు లేవట. ముంబైలోని తన నివాసానికి దగ్గర్లో ఉన్న ఓ థియేటర్ లో తమన్నా ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూసి తన ఆనందాన్ని వారితో పంచుకుందట. ఆసక్తికరంగా తమన్నా ప్రధాన భూమిక పోషించిన 'ఆనంద తాండవం' చిత్రం కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై వి.రవిచంద్రన్ నిర్మించిన 'ఆనంద తాండవం' ఇటు తెలుగు, అటు తమిళంలో ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ చిత్రం ఫలితం మరో కొద్ది గంటల్లో తేలబోతోంది. 'ఠాగూర్', 'అపరిచితుడు', 'దశావతారం' వంటి బిగ్గెస్ట్ హిట్లిచ్చిన ఆస్కార్ బ్యానర్ సినిమా కావడంతో పరిశ్రమ వర్గాల్లోనూ గట్టి అంచనాలే ఉన్నాయి. 'ఆనంద తాండవం' హిట్టయితే కేవలం వారం రోజుల్లో రెండు హిట్లు దక్కించుకున్న క్రెడిట్ తమన్నాకు దక్కుతుంది. పనిలో పనిగా 'వీడొక్కడే' చిత్రానికీ తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. తమన్నాకు హ్యాపీడేస్ కంటిన్యూ అవుతున్నట్టే...
Be first to comment on this News / Article!
|