నయనతార వెన్నే...
దక్షిణాది హీరోయిన్లల్లో రోజురోజుకూ తన డిమాండ్ పెంచుకుంటూ పోతున్న నయనతార ఎప్పుడూ ఏదో ఒక రాంగ్ రీజన్స్ తో వార్తల్లోకి ఎక్కడం జనాలకు తెలుసు. శింబూతో ప్రేమాయణం, ఆ తర్వాత అది కాస్తా బెడిసికొట్టడం, ఆ ఇద్దరి ప్రైవేటు ఫోటోలు లీక్ అయి కలకలం సృష్టించడం, ఈమధ్యన ఏ తమిళ నిర్మాత దగ్గర అడ్వాన్స్ డబ్బులు తీసుకుని 'బ్యాన్' వరకూ వెళ్లి చివరకు సమస్య సెటిల్ చేసుకోవడం...ఇలా నయనతార గురించి చాలా విషయాలే జనం నోళ్లలో నానాయి. అయితే నయనతార వ్యక్తిత్వానికి మరో ముచ్చటైన కోణం కూడా ఉంది. అయితే ఇది చాలా కొద్దిమందికే తెలుసు. ఈ విషయాలు బయటకు రావడం నయనతారకు ఇష్టం లేకపోవడం వల్లనే ఏమో కానీ ఆమె చేసిన మంచి పనులు ఆలస్యంగా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆమె మనసు వెన్న అనీ...నా అనుకున్న వాళ్ల కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి ఒక్క నిమిషం కూడా లేటు చేయదనీ ఆమె వల్ల ఉపకారం పొందిన కొందరు నయనతారను వేనోళ్ల పొగుడుతున్నారు.
నయనతార నటించిన పలు చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన వెంకట్ మాణిక్యం అనే వ్యక్తి ఈమధ్యన బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నయనతార అపోలో ఆసుపత్రిలో ఆతని వైద్య చికిత్సలకు గాను 3.5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంది. 'చంద్రముఖి', 'బిల్లా' చిత్రాలకు పనిచేసిన మరో ప్రొడక్షన్ మేనేజర్ కమలకన్నన్ ఇటీవల తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ విషయం తెలిసిన నయనతార అతని వైద్య చికిత్స కోసం 2 లక్షల రూపాయలు సహాయం అందించింది. ఆమె నుంచి సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు నయనతార ఔదార్యాన్ని జీవతాంతం మరిచిపోమంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు. గుడ్ జాబ్ నయనా...
Be first to comment on this News / Article!
|