శివారెడ్డికి వివాహం
పాపులర్ మిమిక్ర్రీ ఆర్టిస్టు, కామెడీ నటుడు శివారెడ్డి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడనున్నారు. మే 3వ తేదీన మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఆయన వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్ అయిన స్వాతితో ఆయన వివాహం జరుగనుంది. ఈనెల 6న హైద్రాబాద్ లో పెద్దల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. శివారెడ్డి వివాహానికి పరిశ్రమకు చెందిన ప్రముఖలంతా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
దేశ, విదేశాల్లో వేలాది మిమిక్రీ ప్రోగ్రాం ఇచ్చిన క్రెడిట్ శివారెడ్డికి దక్కుతుంది. విదేశాల్లో 2000కు పైగా ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. అందరితోనూ నవ్వతూ నవ్విస్తూ ఉండే స్నేహశీలిగా శివారెడ్డికి పేరుంది. నటుడిగా 50కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆలీ హీరోగా నటించిన 'పిట్టల దొర' చిత్రంతో ఆయన నటనకు శ్రీకారం చుట్టారు. ఆయన మిమిక్రీ ఆర్టిస్టుగానే నటించిన పాత్రలు కూడా ఉన్నాయి. కొద్దికాలం క్రితం ఆయన 'ఫన్ స్టార్' టైటిల్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. తన సంపాదనలో 25 శాతం సామాజిక సేవకు ఖర్చుపెడుతూ, ముగ్గురు విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తున్నారాయన. శివారెడ్డి వైవిహిక జీవితం శుభప్రదం కావాలని ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|