'నచ్చావ్ అల్లుడు' సాంగ్స్
కమెడియన్ ఆలీ కథానాయకుడుగా శ్రీ సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఉష సింగంశెట్టి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ 'నచ్చావ్ అల్లుడు'. ఎంఎస్ శ్రీచంద్ దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈనెల 13న సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. కోటి సంగీతం అందించిన పాటలన్నీ బాగా వచ్చాయనీ, ఇదే నెలాఖరులో సినిమా విడుదలకు కూడా ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు.
దర్శకుడు శ్రీచంద్ మాట్లాడుతూ, తన వలన ఇతరులకు కానీ, ఇతవరుల వల్ల తనకు గానీ ఎలాంటి సమస్యలు రాకూడదనుకునే కథానాయకుడికి అనుకోకుండా వరుస సమస్యలు చుట్టుముడతాయనీ, వాటిని అతను ఎలా అధిగమించాడన్నది వినోదాత్మకంగా ఉంటుందనీ చెప్పారు. స్క్రీన్ ప్లే కు మంచి ప్రాధాన్యం ఉందన్నారు. రవిబాబు, రఘుబాబు, ఝాన్సీ పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయనీ, ప్రేక్షకులను పూర్తి వినోదం ఖాయమనీ చెప్పారు. సుప్రేన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మలిష్క, చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, ఎం.ఎస్.నారాయణ, కృష్ణభగవాన్, ధర్మవరపు జీవా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|