మిత్రుడు' ఆడియో హిట్
బాలకృష్ణ కథానాయకుడుగా భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం 'మిత్రుడు'. యంగ్ బ్యూటీ ప్రియమణి కథానాయికగా నటి్స్తోంది. వైష్ణవి సినిమా పతాకంపై మహాదేవ్ (తొలిపరిచయం) దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి ఇటీవల నేరుగా విడుదలైన ఆడియో మంచి సక్సెస్ సాధిస్తోందని నిర్మాత కృష్ణప్రసాద్ తెలిపారు.
బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ ను సాధించాయనీ, ఆ కోవలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం పాటలు కూడా శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయనీ చెప్పారు. సినిమాలోని ఆరు పాటల్లో 5 పాటల చిత్రీకరణ జరిగిందనీ, బ్యాలెన్స్ పాటను త్వరలోనే చిత్రీకరించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామనీ చెప్పారు. హైద్రాబాద్ తో పాటు మలేసియాలోని పలు లొకేషన్లలో ఎంతో రిచ్ గా షూటింగ్ జరిపినట్టు చెప్పారు. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మరో చిత్రం అవుతుందనే నమ్మకం ఉందనీ, విజయేంద్ర ప్రసాద్ కథ, ఎం.రత్నం సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్స్ అవుతాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, ప్రదీప్ రావత్, బాలయ్య, తనికెళ్ల భరణి, ధర్మవరపు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, హేమ, ఝాన్సీ తదితరులు నటించారు. అనధికార సమాచారం ప్రకారం ఈనెల 24న 'మిత్రుడు' విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|