బాలీవుడ్ కు సంఘీభావం
మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలతో 50-50 షేర్ విషయంలో బాలీవుడ్ నిర్మాతలు సాగిస్తున్న నిరవధిక పోరాటానికి ఆంధ్రప్రదేశ్ సినీ నిర్మాతల మండలి సంఘీభావం తెలిపింది. ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శ టి.వి.డి.ప్రసాద్, మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.
టివిడి ప్రసాద్ మాట్లాడుతూ, మల్టీప్లెక్స్ థియేటర్ రెంటల్స్ 60 నుంచి 80 శాతం వరకూ ఉంటున్నాయనీ, ఇందువల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారనీ అన్నారు. దీనిపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నామని అన్నారు. ఎవరికీ నష్టం లేకుండా 50-50 విధానాన్ని అనసరించాలంటూ బాలీవుడ్ నిర్మాతలు చేస్తున్న పోరాటానికి తమ సంఘాభావం ఉంటుందన్నారు. అక్కడ పరిష్కారం లభిస్తే ఇక్కడ కూడా ఇదే విధానం అమలవుతుదని చెప్పారు. బాలీవుడ్ నిర్మాతలు చేస్తున్న పోరాటానికి షారూక్, అమీర్ ఖాన్ మద్దతు తెలవడం మంచి పరిణామని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|