బ్యాంకాక్ కు 'కరెంట్'
'కాళిదాసు' చిత్రం తర్వాత నాగార్జున మేనల్లుడు సుశాంత్ కథానాయకుడుగా రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ 'కరెంట్'. సూర్యప్రతాప్ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం మూడు పాటల చిత్రీకరణ మినహా పూర్తయింది. వీటిలో ఒక పాట చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ బ్యాంకాక్ వెళ్తున్నట్టు నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల తెలిపారు.
ఈనెల 12 నుంచి 17 వరకూ బ్యాంకాక్ లో సుశాంత్, హీరోయిన్ స్నేహఉల్లాల్ పై ఓ పాటను చిత్రీకరించనున్నట్టు వారు తెలిపారు. ఇటీవల అన్నపూర్ణా స్టూడియోస్ లో మూడు సెట్స్ నిర్మించి ఓ పాట తీశామనీ, మిగిలిన పాటలను కూడా వరుసగా చిత్రీకరించి మేలో సమ్మర్ స్పెషల్ గా సనిమాను విడుదల చేస్తామని చెప్పారు. ప్రేమకథా చిత్రాల్లో ఇదో సరికొత్త ట్రెండ్ ను సృష్టించే చిత్రమతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, షఫీ, రఘుబాబు, సుధ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ, కణల్ కన్నన్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|