'సరే నీ ఇష్టం' ఆడియో
భాగ్యరాజా తనయుడు శాంతన్ భాగ్యరాజా, ఆంద్రిత్ర హీరోహీరోయిన్లుగా పూర్ణచంద్ర మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ చంద్ర, రమేష్ రెడ్డి, జీవితరెడ్డి, సామారెడ్డి నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం 'సరే నీ ఇష్టం.' మహేష్ చంద్ర దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఆడియో క్యాసెడ్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని సారిపల్లి కొండలరావుకు అందజేశారు. మరో అతిథిగా విచ్చేసిని హీరో వరుణ్ సందేష్ ఆడియో సీడీని విడుదల చేసి తనుష్ కు అందజేశారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదల చేశారు.
భాగ్యరాజా తనయుడు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలోని ఆరు పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయనీ, ఈ సమ్మర్ లోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నామనీ దర్శక నిర్మాతలు తెలిపారు. టైటిల్ చక్కగా ఉందనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజాయాన్ని సాధించి నిర్మాతలు లాభాలు, దర్శకుడికి మంచిపేరు తెచ్చిపెట్టాలని ఎస్వీ కృష్ణారెడ్డి, సారిపల్లి కొండలరావు తదితరులు అభిలషించారు. ఈ కార్యక్రమంలో మహేష్ చంద్ర, రమేష్ రెడ్డి, జయేందర్ రెడ్డి, కోటి, ఎన్.శంకర్, సామ్రాట్, సందీప్, వెంకీ, విక్రమ్, కందికొండ, వెనిగెళ్ల రాంబాబు, గుండు సుదర్శన్, కాశీ విశ్వనాథ్, అపూర్వ, దైవజ్ఞశర్మ, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు. చక్రి సంగీత విభావరితో అలరించారు.
Be first to comment on this News / Article!
|