ఫిల్మ్ సిటీలో 'జగన్మోహిని'
రాజా హీరోగా, నమిత టైటిల్ పాత్రల్లో మురళీ సినీ క్రియేష్స్ పతాకంపై హెచ్.మురళి నిర్మిస్తున్న జానపద చిత్రం 'జగన్మోహిని'. ఎన్.కె.విశ్వనాథన్ దర్శకుడు. బి.విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఓల్డ్ క్లాసిక్ 'జగనోహ్మిని' చిత్రానికి రీమేక్ గా ఇది రూపొందుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రయూనిట్ శనివారంనాడు ఈ చిత్రం ప్రోగ్రస్ ను తెలియజేసింది.మరో చిత్రం కోసం ఇక్కడే ఉన్న కమల్ హాసన్ సైతం విచ్చేసి చిత్రయూనిట్ ను అభినందించడం విశేషం.
నిర్మాత మురళి మాట్లాడుతూ, తొలుత ఈ చిత్రం కోసం నానక్ రామ్ గూడాలో సెట్స్ వేసి పలు సన్నివేశాలు చిత్రీకరించామనీ, అనంతరం వైజాగ్, తలకోన, అండమాన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామనీ చెప్పారు. కథ పాతదే అయినా దర్శకుడు తెరకెక్కిస్తున్న విదానం కొత్తగా ఉంటుందనీ, గ్రాఫిక్స్ కు చాలా ప్రాధాన్యం ఉందనీ చెప్పారు. అలాగే ఈ సినిమా కోసం తీసిన అండర్ వాటర్ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయన్నారు. ప్రస్తుతం సినిమాలోని బ్యాలెన్స్ సన్నివేశాలను పూర్తి చేస్తున్నామనీ, జూన్ 15న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. నమిత మాట్లాడుతూ, ఇందులో తాను టైటిల్ రోల్ పోషిస్తున్నాననీ, చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తుండటం సంతోషంగా ఉందనీ చెప్పారు. హీరో రాజా మాట్లాడుతూ, ఈ జానపద చిత్రంలో రాకుమారుడిగా తాను నటిస్తున్నాననీ, తన కెరీర్ లోనే ఇది వైవిధ్యమైన పాత్ర అవుతుందనీ చెప్పారు. 'అరుంధతి' చిత్రం తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ చిత్రానికి యన్.కె.విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|